యాదాద్రి ఆలయం క్యూలైన్లలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. క్యూలైన్లలో వేసిన చలువపందిళ్లకు మంటలు అంటుకున్నాయి. లైన్లలో వేచి ఉన్న భక్తులు, ఆలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై బయటకి వచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరకీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆలయానికి దూరంగా పాత దస్త్రాలు కాల్చివేస్తుండగా కాగితాలు ఎగిరివచ్చి చలువ పందిరిపై పడి మంటలు చెలరేగాయని ఆలయ సిబ్బంది తెలిపారు.
ఇవీ చదవండి: తాగునీరిచ్చేందుకు కర్ణాటక అంగీకారం