ETV Bharat / state

'ఆ వృద్ధురాలి కుమారులు, కోడళ్లను ప్రవేశపెట్టండి'

author img

By

Published : Jul 11, 2020, 10:38 AM IST

యాదాద్రి జిల్లా లింగోటం గ్రామానికి చెందిన జెల్లా సంపూర్ణ‍‌(65) నుంచి ఆమె కుమారులు ఆస్తి పత్రాలు లాక్కోవడంతోపాటు దాడి చేశారు. ఈ సంఘటన పట్ల 'ఆస్తులే ముద్దు.. అమ్మ వద్దు!' అనే శీర్షికన ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనంపై ఎస్‌హెచ్‌ఆర్సీ స్పందించింది. ఆ వృద్ధురాలి ఇద్దరు కుమారులతోపాటు కోడళ్లు ఆగస్టు 7న తన ఎదుట హాజరుపర్చాలని యాదాద్రి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది.

'ఆ వృద్ధురాలి కుమారులు, కోడళ్లను ప్రవేశపెట్టండి'
'ఆ వృద్ధురాలి కుమారులు, కోడళ్లను ప్రవేశపెట్టండి'

కన్నతల్లి నుంచి ఆస్తి పత్రాలు లాక్కోవడంతో పాటు దాడి చేసిన కుమారుల సంఘటన పట్ల ‘ఆస్తులే ముద్దు.. అమ్మ వద్దు!’ అనే శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(ఎస్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. ఆ వృద్ధురాలి ఇద్దరు కుమారులతో పాటు కోడళ్లను ఆగస్టు 7న తన ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరుపర్చాలని ఆదేశిస్తూ యాదాద్రి పోలీసు ఠాణా ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీచేసింది. సంబంధిత జిల్లా సంక్షేమాధికారులు.. వయోధికురాలిని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ఉంచాలని ఆదేశాలిచ్చింది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం లింగోటం గ్రామానికి చెందిన జెల్లా సంపూర్ణ(65)కు ఇద్దరు కుమారులు. భర్త కిష్టయ్య పదేళ్ల క్రితమే మరణించగా ఉన్న భూమిని సాగు చేసుకోవడంతోపాటు కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఆమె పేరిట ఉన్న భూమి, ఇతర విలువైన వస్తువులను కాజేయడానికి కుమారులు శ్రీనివాస్‌, జ్ఞానేశ్వర్‌ కోడళ్లతో కలిసి కుట్ర చేశారు.

మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడి చివరకు విచక్షణారహితంగా దాడిచేసి ఆమె దగ్గరున్న ఆస్తినంతా లాక్కున్నారు. దీనిపై ఆమె స్థానిక పోలీసులు, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన కుమారులు ఆమెను మరోసారి పోలీసులు, అధికారుల వద్దకు వెళ్తే చంపేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రాణ భయంతో సంపూర్ణ ఇల్లు వదిలి బయటకు వచ్చింది.

ఇది చదవండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.