యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి- కొత్తగూడెం మార్గంలో పిల్లాయిపల్లి కాలువకు గండి పడింది. రోడ్డు తెగిపడగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే మార్గంలో పిల్లాయిపల్లి కాలువ వద్ద ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి చిక్కుకుపోగా.. అందులో ప్రయాణిస్తున్న నలభై మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
బునాదిగాని కాల్వ తెగి లక్ష్మీదేవి గూడెం, పడమటి సోమారం గ్రామాల్లో సుమారు 40 ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. భువనగిరి- చిట్యాల మధ్య రహదారుల మీది నుంచి వరదలు ప్రహిస్తుండగా వలిగొండ వద్దనున్న మూసీ పొంగుతోంది. ఈ మేరకు ముందు జాగ్రత్తగా చిట్యాల వెళ్లే వాహనాలను భువనగిరి శివార్లలోనే నిలిపివేస్తున్నారు.
ఇదీ చదవండిః ఎడతెరపి లేకుండా కురస్తున్న వర్షం.. తడిసిముద్దైన ధాన్యం