అడ్డగూడూరు కస్టోడియల్ మృతిపై న్యాయం చేయాలంటూ పౌర హక్కుల నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ, నష్టపరిహారం కోరుతూ పీయూసీఎల్ ప్రధాన కార్యదర్శి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
పోలీసుల వేధింపుల వల్లే మరియమ్మ మరణించినట్లు పిటిషనర్ ఆరోపించారు. రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని తన పిల్లో కోరారు. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. రేపు విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది.
ఏం జరిగిందంటే...
ఓ చోరీ కేసులో విచారణకు తీసుకొచ్చిన మరియమ్మ.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్లో జూన్ 18న అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దొంగతనం కేసు విచారణలో పీఎస్కు తరలిస్తుండగా ఆవరణలోనే స్పృహతప్పి పడిపోవడం వల్ల భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు ఎస్సై వి.మహేశ్ చెప్పారు. మృతురాలి స్వగ్రామం ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడ.
ఇప్పటికే చర్యలు తీసుకున్న సీపీ
పోలీసులు కొట్టడంతోనే మరియమ్మ మరణించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తూ... చర్యలు చేపట్టారు. స్థానిక ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని భువనగిరి జోన్ డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
సంబంధిత కథనాలు..