యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో ఒక వైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజాపేటలోని వ్యాపార వర్గాలు మధ్యాహ్నం వరకే దుకాణాలు తెరిచి ఉంచే విధానం కొనసాగుతోంది.
ఈ క్రమంలో పీఏసీఎస్‌కు 440 యూరియా సంచులు రాగా.. పంపిణీ ప్రక్రియను రాజపేట గోదాం ఆవరణలో అధికారులు ఏర్పాటు చేశారు. వీటిని తీసుకువెళ్లే ప్రక్రియలో భాగంగా రైతులు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా క్యూ లైన్‌లో ఉండడం కనిపించింది కలవరానికి గురి చేస్తోంది. ఇందులో కొందరు మాస్కులు ధరించకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్