యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇన్నిరోజులు ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు... ఇవాళ కురిసిన వర్షంతో కాస్త చల్లబడ్డారు. వర్షంతో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి పట్టణంలో రోడ్లు జలమయమయ్యాయి. వర్షం నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.నియోజకవర్గ వ్యాప్తంగా వర్షంతో ఎలాంటి నష్టం సంభవించ లేదు.
ఇదీ చూడండి: చిరుత: అడవి నాదే..నగరం నాదే..