యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. ఈనెల 29న ప్రారంభమైన ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగాయి. చివరి రోజైన నేడు పవిత్రముల ధారణ, మహా పూర్ణాహుతితో ఉత్సవాలను శాస్త్రోత్సంగా ముగించారు.
తెలిసీ తెలియక ఏడాది నుంచి చేసిన తప్పొప్పులు తొలగిపోవడానికి ప్రతి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు.
ఇవీ చూడం ఇవీ చూడండి: ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!