యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మత్స్యావతారంలో శ్రీ లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు కనువిందు చేశారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని మత్స్యావతారంలో అలంకరించి బాలాలయ తిరువీధుల్లో ఊరేగించారు.


బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

ఇదీ చదవండి: కేంద్రం రిజర్వేషన్లు తొలగిస్తోందని అసత్య ప్రచారం: రఘునందన్