జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద నూరు శాతం నగదు రహిత చెల్లింపులు సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యయి. యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి, గూడూరు టోల్‌ప్లాజాల వాద్ద ఫాస్టాగ్ ఉంటేనే వాహనాలను అనుమతిస్తున్నారు.
ఫాస్టాగ్ లేని వాహనాలను టోల్‌ప్లాజాల నుంచి అనుమతించడం లేదు. ఆ వాహనాలను అక్కడే నిలిపివేసి.. ఫాస్టాగ్‌ని కొనుగోలు చేసేలా సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. వారి నుంచి రెట్టింపు టోల్ వసూలు చేసి అనుమతిస్తున్నారు. ఇది చివరి అవకాశంగా వారిని హెచరిస్తున్నారు. 98శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉండడంతో నిరాటంకంగా టోల్‌ప్లాజాల నుంచి దూసుకుపోతున్నాయి. ఫాస్టాగ్ కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: కొండగట్టు అంజన్న దర్శనానికి బారులుతీరిన భక్తులు