భూఆక్రమణ కేసులో నిందితుడైన నయీమ్ అనుచరుడు మహమ్మద్ అబేద్ అలీని భువనగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. భువనగిరి పట్టణ శివారు ప్రాంతం, నల్లగొండ రోడ్డులో కురుపతి శ్రీదేవి, శ్రీనివాస్‌కి చెందిన 9 ఎకరాల 6 గుంటల భూమిని ఆక్రమించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో ఇప్పటికే నయీమ్ తల్లి తాహేరా బేగం, సోదరి సలీమా బేగం, అయేషాబేగం, ఎంఏ సలీం అరెస్టయ్యారు. ఈ కేసులో రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో సాక్షిగా సంతకం చేసిన పహాడీనగర్కి చెందిన మహమ్మద్ అబేద్ని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేందర్ వెల్లడించారు.
ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన