జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, నాబార్డ్ నిర్వహించిన ఉచిత మగ్గం వర్క్ శిక్షణ పూర్తి చేసిన 30 మంది మహిళలకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి అర్హతా పత్రాలను అందజేశారు. మహిళలు ఆర్థికంగా నిలదోక్కుకోవడానికి ఇలాంటి ఉచిత శిక్షణా తరగతులను వినియోగించుకోవాలని సూచించారు.
నాబార్డ్ ఆద్వర్యంలో ఎన్నో రకాల ఉపాధి శిక్షణలు ఉన్నాయనీ, ఎవరికి నచ్చిన ఉపాధిలో వారు నైపుణ్యం పొంది అభివృద్ధి చెందాలని సావిత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు లగ్గాని ప్రియాంక, శిక్షణ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం