యాదాద్రి భువనగిరి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మార్కెట్ యార్డ్‌లో ధాన్యం మొలకెత్తింది. ఆరుగాలం శ్రమించిన పంట ఇలా అకాల వర్షంతో పాడై రైతన్న కంట కన్నీరు పెట్టిస్తోంది. ఎన్నో కష్టాలు పడి పండించిన పంట సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్ల నష్టపోయామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్, వలిగొండ రామన్నపేట, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో మార్కెట్ యార్డ్‌లోని ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు కడగండ్లు మిగిల్చిన వరణుడు
అకాలం వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలైంది. మార్కెట్ యార్డులో ధాన్యం మొలకెత్తింది.