యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక ఛైర్‌పర్సన్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కూటమి నుంచి గెలిచిన అభ్యర్థుల్ని తెరాస కొనుగోలు చేసిందని... కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆందోళనకు దిగారు.
చౌటుప్పల్‌లో 21మంది వార్డు సభ్యులు ఉండగా... 14 మంది ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ 5, సీపీఎం 3స్థానాల్లో విజయం సాధించాయి. తమ మద్దతుతో గెలిచిన సీపీఎం అభ్యర్థుల్ని తెరాస ప్రలోభపెట్టిందని రాజగోపాల్‌రెడ్డి నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. తమ ఎమ్మెల్యే అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చౌటుప్పల్ జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
తమ మద్దతుతో గెలిచిన కమ్యూనిస్టు సభ్యులు.. 5కోట్లకు అధికార పార్టీకి అమ్ముడు పోయారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా డబ్బులు పంచారన్నారు.
ఇవీ చూడండి: కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరణపై ఎస్ఈసీకీ ఫిర్యాదు