లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న వలస కూలీలు కాలినడకన సొంత గ్రామాలకు బయలు దేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కొంత మంది కూలీలు హైదరాబాద్ బాచుపల్లి నుంచి కాలినడక సొంతూళ్లకు బయలుదేరారు. కొద్దిదూరం ఆటోలో వెళ్లి.. ఆ తర్వాత నడుచుకుంటూ భువనగిరికి చేరుకున్నామని తెలిపారు.
పట్టణ శివారులోని బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద సేదతీరుతున్న వారిని అటుగా వెళుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి చూసి.. కారు ఆపి పలకరించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. భోజన అనంతరం ప్రత్యేక వాహనంలో వారిని వెనక్కు పంపించారు.
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని డీసీపీ అన్నారు. హైదరాబాదులో పనులు లేకపోవడం వల్ల పిల్లాపాపలతో తాము ఇంటి దారి పట్టామని వలస కూలీలు అంటున్నారు.
ఇదీ చూడండి : మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త