యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కామునికంత కాలనీకి చెందిన కడారి పద్మ గురువారం అదృశ్యమైంది. హైదరాబాద్ బోడుప్పల్‌లోని తన చెల్లెలి ఇంటికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరింది. గురువారం రాత్రి వరకూ బోడుప్పల్ చేరుకోకపోవటం వల్ల కుటుంబ సభ్యులు... బంధువుల ఇళ్లలో వాకబు చేశారు . అయినా పద్మ ఆచూకీ దొరకలేదు. శుక్రవారం భువనగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అంజయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవీ చూడండి: ఒంటరిగానే పెరిగింది... కన్నబిడ్డను ఒంటరి చేసింది