యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్, ఆలేరు, రాజపేట మండలాల్లో పోలీసులు పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. యాదగిరిగుట్టలో ఉదయం 10 గంటలు దాటగానే పోలీసులు దుకాణాలు మూయించివేశారు. లాక్డౌన్ అమలులోకి వచ్చినా.. రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
మరోవైపు లాక్డౌన్ అమలులోకి రాగానే పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. నేటి నుండి ఈ నెల 21 వరకు స్వామివారి దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆలయంలో నిత్యం నిర్వహించే స్వామివారి నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం అంతరంగికంగా యధావిధిగా కొనసాగుతాయన్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్