యాదాద్రీశుడి ఆలయంలో బాహ్య అంతర్ ప్రాకారాల చుట్టూ శిల్పకళా సౌందర్యం వెలుగులీనేలా సుమారు 396 ఎల్ఈడీ విద్యుద్దీపాలు అమర్చారు. గర్భాలయం మధ్య భాగంలో జపాన్ నుంచి తెప్పించిన సుమారు 75లక్షల 45 వేల విలువైన శాండ్లియర్‌ను అమర్చారు. ఆలయ ముఖ మండపంలో కృష్ణ శిలతో తీర్చిదిద్దిన 12 ఆళ్వార్ల విగ్రహాల శిరస్సులపై గంటాకారపు విద్యుత్ దీపాలు బిగించారు.
ముఖమండపంలోని పైఅంతస్తులో కాకతీయ పిల్లర్లపై పసిడి వర్ణపు దీపాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు యాదాద్రీశుడికి స్వర్ణరథం సిద్ధమవుతోంది. వార్షికోత్సవాల్లో వినియోగిస్తున్న టేకు రథానికి బంగారు తొడుగులు అమర్చుతున్నారు. దాతలు శ్రీలోగిల్లు, ల్యాండ్ మార్క్ ఎండీలు ఒంటేరు సురేశ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి సుమారు 60 లక్షల వ్యయంతో రథానికి చెన్నైలో స్వర్ణ కవచాలు తయారు చేయిస్తున్నారని యాదాద్రి ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: రాత్రి కర్ఫ్యూ పొడిగింపుపై నేడు కేసీఆర్ నిర్ణయం