ETV Bharat / state

భూముల ధరలకు రెక్కలు.. దండుకుంటున్న అక్రమార్కులు - భూముల ధరలకు రెక్కలు.. దండుకుంటున్న అక్రమార్కులు

భాగ్యనగరం శివారు ప్రాంతాల్లో  కోట్లు విలువ చేసే భూములు... రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్నాయి. స్థానిక స్థిరాస్తి మాఫియాతో ఏళ్లుగా పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారి... అక్రమ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేట శివారులో వంద కోట్ల విలువైన భూమి... వివాదాస్పదంగా మారడం బాధితుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.

భూముల ధరలకు రెక్కలు.. దండుకుంటున్న అక్రమార్కులు

author img

By

Published : Jan 1, 2020, 5:42 PM IST

భూముల ధరలకు రెక్కలు.. దండుకుంటున్న అక్రమార్కులు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు రాజధానికి ఆనుకుని ఉన్నందున అక్కడి భూముల ధరలు ఎకరాకు రెండు నుంచి మూడు కోట్లు పలుకుతాయి. ఇది ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు.. ఒకే భూమిని నలుగురైదుగురికి అంటగడుతూ దండుకుంటున్నారు. వాటిని కొన్న వారు మాత్రం చివరకు బాధితులుగా మిగిలిపోతున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న చౌటుప్పల్ సమీపం తూఫ్రాన్ పేటలోని 72, 74, 85, 87, 88, 89 సర్వే సంఖ్యల్లో... సుమారు 50 ఎకరాల్లో శివప్రియ నగర్-2 పేరుతో రెండు దశాబ్దాల క్రితం వెంచర్ వేశారు. 88, 89 సర్వే సంఖ్యల్లో 40 ఎకరాల భూమిలో వెంచర్ వేసి... ఒక్కోటి రెండు వందల చదరపు గజాల చొప్పున మొత్తం 828 ప్లాట్లు వేశారు.

స్థానిక పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి జీపీఏ చేసుకుని... 2000-2001 మధ్య ప్లాట్లను విక్రయించాడు. వీటిని రెండు రాష్ట్రాల్లోని వందల మంది కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలో ఎకరం ధర 2 కోట్లకు ఉండగా... కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినదంటూ సదరు భూమి వద్ద బోర్డు వెలిసింది. గత ఏప్రిల్లో వెంచర్లో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను తొలగించి లోపలికి ఎవరూ వెళ్లకుండా... కందకాలు ఏర్పాటు చేశారు. ఈ పరిణామంతో స్థలాలు కొన్నవారు ఆందోళనలో పడ్డారు.

20 ఏళ్ల క్రితమే కొన్న ప్లాట్లను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు బాధితులు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్​తోపాటు డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. 2008లో తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించానని కాటసాని అంటున్నారు. తనకంటే ముందు గనుక కొనుగోలు చేసినట్లు ఆధారాలు చూపితే... సదరు భూమి వారికే ఇచ్చేస్తామన్నారు. అయినా బాధితుల్లో ఆందోళన తగ్గడం లేదు.

తూఫ్రాన్ పేటలోని ఆరు సర్వే సంఖ్యల్లోని వివాదాస్పద భూమిని... సంబంధిత యజమానులు చాలా ఏళ్ల క్రితమే జీపీఏ చేసినట్లు అర్థమవుతోంది. ఇక్కడి సర్వే సంఖ్యల్లో 88 ఎకరాలు ఉండగా... స్థిరాస్తి వ్యాపారాన్ని శాసిస్తున్న వ్యక్తి అందులో కేవలం ఐదు ఎకరాలు మాత్రమే కొని మిగిలిన భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి పలువురికి అమ్మినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీలు తీస్తే... ప్లాట్లు కొన్నవారి పేరుతోనే భూములున్నాయి. రెవెన్యూ రికార్డులు చూస్తే మాత్రం... స్థానిక రైతుల పేరు మీద కనపడుతున్నాయి.

చౌటుప్పల్ పరిసరాల్లో లక్కారం, తంగేడుపల్లి, తూఫ్రాన్ పేట, మల్కాపురం శివార్లలో... గత నాలుగైదేళ్ల క్రితం నుంచి దాదాపు 8 వందల వరకు వెంచర్లు వెలిశాయి. స్థానిక రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ అధికారులతోపాటు సర్పంచులను మచ్చిక చేసుకుని... ప్రభుత్వ అనుమతి లేకుండా అడ్డగోలుగా ఏర్పాటు చేసిన వెంచర్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రాంతంలోనే తాజాగా పారిశ్రామిక పార్కుకు శంకుస్థాపన కావడం, బాటసింగారంలో లాజిస్టిక్ పార్కు, రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న డ్రైపోర్టు కూడా ఈ ప్రాంతానికి దగ్గర్లో ఏర్పాటు చేస్తామని చెప్పినందున భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని వ్యక్తుల వల్లే... భూ వివాదాలు పెచ్చుమీరుతున్నాయి. అందుకే చౌటుప్పల్ ప్రాంతంలో సమగ్రంగా సర్వే చేస్తే... అక్రమార్కుల గుట్టు బయటపడుతుందని బాధితులుగా మిగిలిపోతున్న భూ యజమానులు అంటున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 3148 డ్రంక్​ అండ్ డ్రైవ్​ కేసులు

Intro:TG_Nlg_01_30_Land_litigation_pkg_Ts10102_3067451

Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లా

Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.