ఒకే దేశం, ఒకే చట్టం పేరుతో దేశవ్యాప్తంగా ఆర్టికల్ 370 రద్దుపై ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం భాజపా జన జాగరణ సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత కేవలం మూడు ప్రాంతాలు మాత్రమే భారతదేశంలో కలవ లేదన్నారు. కానీ తరువాత ఆ ప్రాంతాలు కూడా భారతదేశంలో విలీనం అయ్యాయన్నారు. జమ్ము కశ్మీర్లోని ప్రజలను మాత్రం ఇప్పటివరకు భారత దేశ పౌరులుగా గుర్తించలేదు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఒకటే దేశం, ఒకటే ప్రాంతంగా ఏర్పడిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రజల మేలు కోసం ఈ పని చేసిందని ఎమ్మెల్సీ రామచంద్ర రావు వెల్లడించారు.
ఇదీ చూడండి : అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు