ETV Bharat / state

పారిశ్రామిక పార్కుతో దండుమల్కాపురంలో దండిగా ఉపాధి - industrial park

యాదాద్రి భువనగిరి జిల్లా పారిశ్రామిక పార్క్‌తో తలమానికం కానుంది. ఈ ప్రాంతాన్ని  పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగనున్నాయి. రాజధానికి అతిసమీపంలో ఉండటం, భూములు అనుకూలంగా ఉండటం వల్ల చాలా పరిశ్రమలు ఇక్కడకు రానున్నాయి.

పారిశ్రామిక పార్కుతో దండుమల్కాపురంలో దండిగా ఉపాధి
author img

By

Published : Aug 25, 2019, 3:35 PM IST

పారిశ్రామిక పార్కుతో దండుమల్కాపురంలో దండిగా ఉపాధి

రాష్ట్రంలో 2004 నుంచి ఒక్క పారిశ్రామిక పార్కు కూడా ఏర్పాటు కాలేదు. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు దండుమల్కాపురంలో పార్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. కాలుష్యరహిత పారిశ్రామిక కారిడార్​ కార్యచరణ బాధ్యతల్ని కేటీఆర్​కు కట్టబెట్టారు సీఎం. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. రవాణా మార్గాలు అనుకూలంగా ఉండటం, బాహ్యవలయ రహదారి కూతవేటు దూరంలో ఉండటం, తెరాస పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇప్పటివరకు పెద్ద ప్రాజెక్టు లేకపోవడం దండుమల్కాపురం​లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రధాన కారణాలు.

అసైన్డ్​ కన్నా ఎక్కువ ఇవ్వాలి

తొలివిడతలో 128 మంది రైతుల నుంచి... 371.06 ఎకరాల భూమిని సేకరించారు. అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఎకరాకు 11 లక్షల 60 వేల చొప్పున చెల్లించి... సదరు భూముల్ని టీఎస్​ఐఐసీకి అప్పగించింది రెవెన్యూ శాఖ. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు మరో 580.07 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ప్రభుత్వం తక్కువ పరిహారం ఇస్తోందంటూ కొందరు పట్టాదారులు భూములిచ్చేందుకు ముందుకు రాలేదు. అసైన్డ్ రైతులకన్నా ఎక్కువ ఇస్తేనే పట్టా భూములు ఇచ్చేందుకు సిద్ధమని... భూయజమానులు స్పష్టం చేశారు.

ఉద్యోగాలొస్తాయని

12 వందల ఎకరాల్లో నిర్మించనున్న పార్కులో... 30 వేల మంది నివాసం ఉండటానికి వసతులు కల్పించనున్నారు. చౌటుప్పల్ పరిసరాల్లో ఇప్పటికే వందకు పైగా ఔషధ పరిశ్రమలు ఉండటం... అవి వెలువరించే కాలుష్యంతో ఎక్కడిక్కడ భూగర్భజలాలు దారుణ స్థితికి చేరడం వల్ల... ముందుగా పారిశ్రామిక పార్కునూ స్థానికులు అదే కోణంలో చూశారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కేవలం హరితమయ పార్కు మాత్రమే వస్తుందన్న భరోసాతో... భూయజమానులు తమ భూముల్ని అప్పగించారు. మరోవైపు స్థానికంగానే తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న ఉద్దేశం కూడా... భూములు ఇవ్వడానికి మరో కారణం.

త్వరలో శిలాఫలకం

ఈ పార్కు వల్ల స్థానిక యువతకు ఆశించిన రీతిలో ఉపాధి లభించే అవకాశం కలుగుతోంది. దీని నిర్మాణం కోసం... భూవినియోగ మార్పిడి దాదాపుగా పూర్తయింది. పర్యావరణ అనుమతులు లభించాయి. మిగతా అనుమతులూ దశల వారీగా రానున్నాయి. స్థలాల కోసం దశాబ్దాలుగా ప్రయత్నించి విఫలమైన పారిశ్రామికవేత్తలు... పార్కులోని స్థలాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. దండుమల్కాపురం హరిత పారిశ్రామిక పార్కు వద్ద శిలాఫలకం వేసేందుకు త్వరలోనే ముహూర్తం నిర్ణయించి ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఆహ్వానించనున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.