ETV Bharat / state

లాక్​డౌన్​ విధుల్లో ఉన్న పోలీసులకు భోజనం పంపిణీ

కొవిడ్ సంక్షోభంలో.. విధి నిర్వహణలో అహర్నిశలు కృషి చేస్తోన్న పోలీసు​ సిబ్బందికి పలువురు అండగా నిలుస్తున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరులో లాక్​డౌన్​​ విధుల్లో ఉన్న పోలీసులకు.. ఆహారం అందజేసి మానవత్వాన్ని చాటుకుందో ఓ స్వచ్ఛంద సంస్థ.

police part in lockdown crisis
police part in lockdown crisis
author img

By

Published : Jun 3, 2021, 5:43 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో పలువురు దాతలు వివిధ రూపాల్లో సహాయం అందిస్తూ.. తమ దాతృత్వం చాటుకుంటున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన యూత్ రెడ్ క్రాస్ యువకులు.. లాక్​డౌన్ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆహారాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

కరోనా కట్టడికి అహర్నిశలు కృషి చేస్తోన్న పోలీసుల శ్రమ వెల కట్టలేనిదని యూత్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు బీసు మచ్చ పేర్కొన్నారు. పట్టణంలో నెల రోజులుగా కరోనా బారిన పడ్డ వారికి నిత్యావసరాలను అందిస్తూ అండగా నిలుస్తున్నామన్నారు. ఆపత్కాలంలో మానవతావాదులంతా ముందుకొచ్చి నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు.

ఇదీ చదవండి: Suicide: తమ్ముడు సెల్‌ఫోన్‌ ఇవ్వలేదని.. అక్క ఆత్మహత్య.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.