ETV Bharat / state

పంతంగిలో భారీగా వాహనాల రద్దీ.. టోల్‌ బూత్‌లు ఓపెన్‌

పండుగకు సొంతూళ్లకు వెళ్లి హైదరాబాద్ తిరుగు ప్రయాణమైన వారితో... టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. సూర్యాపేట, కొర్లపాడు మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అటు చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్​ ప్లాజా వద్ద కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. ఫాస్టాగ్ అందుబాటులో ఉన్నా... ఒక్కో వాహనం టోల్​ ప్లాజా దాటేందుకు అర గంట పడుతోంది.

heavy-traffic-at-panthangi-toll-plaza-in-nalgonda-dist-between-hydearabad-and-vijayawada
పంతంగిలో భారీగా వాహనాల రద్దీ.. టోల్‌ బూత్‌లు ఓపెన్‌
author img

By

Published : Jan 17, 2021, 7:31 PM IST

Updated : Jan 17, 2021, 10:25 PM IST

విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలతో... టోల్ ప్లాజాల వద్ద రద్దీ కనిపిస్తోంది. జాతీయ రహదారిపై గల పంతంగి, కొర్లపాడుతోపాటు అద్దంకి-నార్కట్​పల్లి దారిలోని మాడ్గులపల్లి ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సూర్యాపేటకు 16 కిలోమీటర్ల దూరంలోని కొర్లపాడు వద్ద... ట్రాఫిక్ స్తంభించింది.

సూర్యాపేట నుంచి కొర్లపాడు చేరేందుకు గంటకుపైగా సమయం పడుతుంది. అక్కడ హైదరాబాద్ వైపున ఆరు టోల్ బూత్​లు అందుబాటులో ఉంచారు. ఇక చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద... కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ బూత్ దాటేందుకు ఒక్కో వాహనానికి అర గంట పడుతోంది. సాధారణ సమయంలో 8 బూత్​లు ఉండగా.. ప్రస్తుతం తొమ్మిది ఏర్పాటు చేశారు. అరగంట పాటు వేచి చూడల్సి రావటంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడ్డారు.

ఇదీ చూడండి : మధ్య మానేరు నుంచి నీటి విడుదల

Last Updated : Jan 17, 2021, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.