యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వరకు ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అనంతరం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు యాదగిరిగుట్టలో భారీ వర్షం కురిసింది. పట్టణంలో పలు కాలనీలలో వర్షపు నీరు నిలిచిపోయింది. గుండ్లపల్లిలోని కొన్ని ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది.
యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లికి వెళ్లే రోడ్డులో వలయ రహదారి పక్కన ఉన్న మట్టి మొత్తం కిందకు జాలువారి రోడ్డుపై వచ్చి చేరింది. వాహనదారులకు, ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, కుంటల్లోకి వరద నీరు వచ్చింది. ఆలేరు నియోజవర్గంలోని ఆలేరు, తుర్కపల్లి, రాజాపేట, మోటకొండూర్ మండలాల్లో చిరుజల్లులు కురిశాయి.