ETV Bharat / state

హాజీపూర్​ బాధిత కుటుంబాలకు కలెక్టర్​ పరామర్శ

యాదాద్రి జిల్లా పాలానాధికారి అనితా రామచంద్రన్​ హాజీపూర్​లోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని భరోసానిచ్చారు. గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

హాజీపూర్​ బాధిత కుటుంబాలకు కలెక్టర్​ పరామర్శ
author img

By

Published : May 5, 2019, 7:19 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్​లో వరుస హత్యలకు గురైన బాధిత కుటుంబాలను డీసీపీతో కలిసి జిల్లా పాలనాధికారి అనితా రామచంద్రన్​ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన ఒక్కరికి ప్రభుత్వ ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్​ హామీనిచ్చారు.

మరోవైపు హాజీపూర్ సహా పరిసర గ్రామాలకు ఆర్టీసీ బస్సు సదుపాయం కోసం సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. పోలీసుల సహాకారంతో హాజీపూర్​కు మొన్నటి నుంచి ఓ బస్సును నడుపుతున్నట్లు గుర్తుచేశారు. వాగుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయన్న కలెక్టర్​... ఎన్నికలు పూర్తికాగానే బ్రిడ్జి పనులు మొదలవుతాయని తెలిపారు. వీలైనంత తొందరగా హాజీపూర్​లో సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తామని... ఎలాంటి భయాందోళనకు గురికావోద్దని అన్నారు. విద్యార్థులకు, మహిళలకు అన్నివిధాలా భద్రతా కల్పిస్తామని, వరుస హత్యల నేపథ్యంలో భయంతో చదువులు మానేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.