ETV Bharat / state

ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ

కరోనాతో ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థతి అగమ్యగోచరంగా మారింది. జీతాల్లేక దయనీయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఉపాధి కోల్పోయిన వారికి జిల్లా వైద్యాధికారి సాయంతో ఎన్​ఆర్​ఐ ఫోరం ద్వారా బోధన, బోధనేతర సిబ్బందికి సరుకులను పంపిణీ చేశారు. అత్మస్థైర్యం కోల్పోవద్దని వారిలో స్ఫూర్తి నింపారు.

Grocery distribution for private teachers in yadadri bhuvanagiri  valigonda
ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Oct 8, 2020, 7:28 PM IST

కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో నిత్యావసరాలను అందించారు. జిల్లా వైద్యాధికారి సాయంతో ఎన్​ఆర్​ఐ ఫోరం ద్వారా బోధన, బోధనేతర సిబ్బందికి సరుకులను పంపిణీ చేశారు. కరోనా కాలంలో వలస కార్మికులకు, ఆరోగ్య కార్యకర్తలకు నల్గొండ.ఓఆర్​జీ సంస్థ ద్వారా సహాయం అందించామని జిల్లా సమన్వయకర్త రమేష్ తెలిపారు.

ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మన్యూనతాభావానికి లోనుకావొద్దని వారిలో ధైర్యం నింపారు. అత్మస్థైర్యం కోల్పోకుండా జీవించాలన్నారు. నిత్యావసరాలు అందజేయడం పట్ల ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయరావు, ప్రైవేట్ పాఠశాలల కార్యదర్శులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:స్కూల్​ ఫీజులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: శివబాలాజీ, మధుమిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.