ETV Bharat / state

పీఏసీఎస్​ ఆధ్వర్యంలో గొలనుకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం

author img

By

Published : Apr 22, 2021, 8:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా గొలనుకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్​ ఛైర్మన్​ మల్లేశం గౌడ్ ప్రారంభించారు. అన్నదాతలు నష్టపోకూడదని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు.

grain purchasing centres
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆ కంపెనీ ఛైర్మన్​ మల్లేశం గౌడ్​ ప్రారంభించారు. దళారుల చేతులో రైతులు మోసపోకుండా ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని మల్లేశం అన్నారు.

ఏ గ్రేడు ధాన్యానికి రూ.1,888 ధర కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు కచ్చితంగా మద్దతు ధరను పొందాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్​ వైస్ ఛైర్​పర్సన్​ చింతకింది చంద్రకళ, మురహరి, డైరెక్టర్స్, బిక్షపతి, గొలనుకొండ సర్పంచ్ బైరపాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మళ్లీ మొదటికే.. మురికి కూపాలను తలపిస్తున్న శౌచాలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.