ETV Bharat / state

Yadadri temple: యాదాద్రీశుడి చెంతకు.. గోదావరి జలాలు - నల్గొండ తాజా వార్తలు

yadadri temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామి వారికి తెపోత్సవం నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపనున్నారు. ఈ నెల 21 నుంచి నుంచి జరిగే మహాసంప్రోక్షణ సమయానికి నీరు గండి చెరువులోకి దూకనున్నాయి.

godavari water
గోదావరి జలాలు
author img

By

Published : Mar 20, 2022, 9:25 PM IST

yadadri temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి యాదాద్రి దేవస్థానంలో జరిగే మహా కుంభ సంప్రోక్షణ వేడుకల్లో భాగంగా జరిపే మహాయాగం అంకురార్పణ పూజా సమయానికి గోదావరి జలాలు గలగలమంటూ గండిచెరువులోకి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్వం సిద్ధమైంది.

మహాకుంభ సంప్రోక్షణ వేడుకల వరకు

ఈ నెల 21 నుంచి యాదాద్రి దేవస్థానంలో జరిగే మహాకుంభ సంప్రోక్షణ వేడుకల్లో భాగంగా జరిపే మహాయాగం అంకురార్పణ పూజా సమయానికి గోదావరి జలాలు గలగలమంటూ గండిచెరువులోకి దూకనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ జలాలు కొమరవెల్లి మల్లన్న సాగర్‌కు చేరగా, అక్కడి నుంచి నృసింహ సాగర్‌(బస్వాపూర్‌) జలాశయానికి కాల్వకు ద్వారా చేరుతాయి. ఈ జలాశయానికి ఐదు కిలోమీటర్ల ముందే యాదగిరిగుట్ట మండలంలోని జంగపల్లి వద్ద కాల్వ నుంచి యాదాద్రికి గోదావరి జలాలు మళ్లుతాయి. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో గండి చెరువు వైపు నీటిని మళ్లింపు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.

గండి చెరువు సామర్థ్యం 0.012 టీఎంసీలు

అక్కడ గేట్లు తెరవడంతో బస్వాపూర్‌ జలాశయానికి ప్యాకెజ్‌-16 ప్రధాన కాల్వలోకి గోదావరి జలాలు దూకాయి. అక్కడి నుంచి 40 కిలోమీటర్లు ప్రవహించి జంగపల్లి వద్ద నిర్మించిన ఓటీ-2 కాల్వలోకి చేరుతాయి. అక్కడి నుంచి దాతారుపల్లి, మల్లాపురం గుండా పది కిలోమీటర్లు ప్రవహించి గండి చెరువులోకి చేరుతాయని అధికారులు తెలిపారు. గండి చెరువు సామర్థ్యం 12 ఎంసీఎఫ్టీ (0.012 టీఎంసీ). ఆ మేరకు చెరువును నింపి ఓటీ కాల్వ గేట్లు మూయనున్నారు. ఇప్పటికే కెనాల్‌ నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. సైదాపురం వీరభద్రాలయం వెళ్లేదారి సమీపం నుంచి పైపులైన్‌ ద్వారా గండి చెరువును అనుసంధానం చేశారు. గండి చెరువు వద్ద జరుగుతున్న తుదిదశ పనులను నీటి పారుదల శాఖ డీఈఈ బాలకృష్ణ శనివారం పరిశీలించారు. గోదావరి జలాలు చెరువులోకి చేరే లోపే అన్ని పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.

Panchkundatma Mahayaga
పంచకుండాత్మక మహాయాగం కోసం కుండాలు ఏర్పాటు

మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా సోమవారం నుంచి బాలాలయంలో ప్రారంభం కానున్న అంకురార్పణకు ఆలయం సుందరంగా ముస్తాబవుతోంది. వారం పాటు జరగనున్న పంచకుండాత్మక మహాయాగం కోసం కుండాలు ఏర్పటయ్యాయి. గర్భాలయం, ముఖమండపం నీటితో శుద్ధి పర్వాలు నిర్వహించారు. ప్రధానాలయం చెంత విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టారు.

ఇదీ చదవండి: YADADRI TEMPLE: యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.