ETV Bharat / state

పంతంగి టోల్​ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్టు

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఓ కారులో 86 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామని, ఒకరు పరారీలో ఉన్నారని డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.

author img

By

Published : Jul 10, 2020, 5:13 PM IST

ఏపీలోని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి గంజాయిని ఉత్తరప్రదేశ్​కు రవాణా చేస్తున్న ముఠా పట్టుపడింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్​లోని ఎల్బీ నగర్​కు చెందిన ఎస్వోటీ పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్​ప్లాజా వద్ద ఈ ముఠాను పట్టుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద ఓ కారులో 86 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామని, ఒకరు పరారీలో ఉన్నారని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్​కు చెందిన ముఠా..

ఉత్తరప్రదేశ్​కు చెందిన మిక్సీ గ్రైండర్ల వ్యాపారి మహమ్మద్ జావీద్, అదే రాష్ట్రానికి చెందిన డ్రైవర్ ముస్తాఖిర్​, వ్యాపారి మహమ్మద్​ షానో, ఒడిశాకు చెందిన మదన్ ఒక ముఠాగా ఏర్పడ్డారని డీసీపీ తెలిపారు. వీరిలో మదన్​ పరారీలో ఉన్నాడని డీసీపీ చెప్పారు. వీరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నర్సీపట్నం నుంచి 86 కిలోల గంజాయిని 46 పొట్లాలుగా కట్టి కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై 12 మిక్సీ గ్రైండర్లను అమర్చారు. పోలీసులు తనిఖీలు చేసి గంజాయితో పాటు కారు, 2వేల నగదు, 2చరవాణులు, 12 మిక్సీ గ్రైండర్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్, అదనపు కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి ప్రకటించారు.

ఇవీ చూడండి: గుట్టుగా గుడుంబా దందా.. ఆబ్కారీ అధికారుల దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.