Fog around Yadadri : యాదాద్రి ఆలయం చుట్టూ పొగ మంచు దుప్పటిలా కమ్మేసింది. ప్రధాన ఆలయంతో పాటు పరిసరాలు, ఘాట్‌రోడ్డు ప్రాంతాలన్నీ పొగమంచుతో కమ్ముకున్నాయి. గత రెండు రోజులుగా ఆలయం పరిసరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొండపైకి వెళ్లే భక్తులు దారి కనిపించక కాస్త ఇబ్బంది పడుతున్నా.. మంచులో ఆలయ పరిసరాలు మరింత శోభను సంతరించుకోవడంతో ఎంతో ఆనందంగా ప్రయాణం చేస్తున్నారు. కొందరు పొగ మంచులో దాక్కున్న యాదాద్రి ఆలయ ఫొటోలు తీస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు.