రాష్ట్రంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లోని వాగులు, చెరువులకు జలకళ సంతరించుకుంటోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువులోకి రాసకాల్వ ద్వారా నీరు వస్తుండటం పట్ల పట్టణ ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పూడిక తీయించాలని రైతుల విజ్ఞప్తి
శామీర్పేట చెరువు నుంచి రాసకాల్వ ద్వారా భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువులోకి నీరు వస్తోంది. అధికారుల అలసత్వం వల్ల ఇప్పటికే సగం చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. కొన్నేళ్లుగా పూడిక తీయక పోవటం వల్ల నీరు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో నిండే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి పూడిక తీయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'మిడదల దండుపై దండయాత్రకు సిద్ధంకండి'