తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని ప్రధాన కూడలిలో రైతులు ధర్నా చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకి పర్రె కాల్వ పొంగటంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయిందని, మిగిలిన ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తడిసి పోచంపల్లి రైతులు నష్టపోయారని, వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ధాన్యాన్ని రోడ్డుపై పోసి, పెట్రోల్ బాటిల్ ముందు పెట్టుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రైతుల వద్ద నుంచి తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: గ్రేటర్లో అభ్యర్థుల తీన్మార్.. హ్యాట్రిక్ కోసం పక్కా స్కెచ్