పంట పొలాల మధ్య నుంచి ఇసుకను తరలించొద్దని యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డగూడూరు మండల పరిధిలోని మూసి నది ఒడ్డున జరిగిన ఈ ధర్నాలో అజీంపేట, రేపాక రైతులు పాల్గొన్నారు.
పొలాల నడుమ అక్రమంగా ఇసుక రవాణా చేయడాన్ని వారు వ్యతిరేకించారు. ఇలాగే కొనసాగిస్తే .. బోర్లు వట్టి పోయి భవిష్యత్తులో పంటలు పండించుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కృషీ యూత్ ఆధ్వర్యంలో మూసీ నది వద్ద ఏర్పాటు చేసిన వంటా -వార్పు కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: బడ్జెట్ సమావేశాలు, సంబంధిత అంశాలపై నేడు సీఎం సమీక్ష