యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు దైవ దర్శనాలు నిలిపి వేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. వారం రోజుల పాటు దర్శనాల నిలిపివేతకు దేవాదాయ శాఖ మంత్రి అంగీకరించినట్లు తెలిపారు.
పట్టణంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. ఎప్పటి నుంచి అమల్లోకి తేవాలనే విషయంపై దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్వామివారికి ఏకాంతంగా నిత్య పూజా కైంకర్యాలు, ఆన్లైన్ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
దర్శనాలు నిలిపివేయాలంటూ వినతులు
స్వామివారి దర్శనాలను నిలిపివేయాలని కోరుతూ పలు రాజకీయ పార్టీల నేతలు ఆలేరు ఎమ్మెల్యే సునీత, ఆలయ ఈవో గీతారెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు వినతి పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో గత నాలుగైదు రోజులుగా ఆలయ దర్శన సమయంలో మార్పులు చేశారు.
ఇదీచూడండి.. పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్