ETV Bharat / state

యాదగిరీశుని దర్శనానికి తప్పని తిప్పలు - యాదాద్రి పునర్నిర్మాణ పనుల వల్ల ఇబ్బంది పడుతున్న భక్తులు

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో సౌకర్యాలు లేక సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. కనీస సౌకర్యాల్లో లోటు కనిపిస్తున్నందున చంటి పిల్లల తల్లులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

యాదాద్రి పునర్నిర్మాణ పనుల వల్ల ఇబ్బంది పడుతున్న భక్తులు
author img

By

Published : Oct 20, 2019, 8:06 PM IST

యాదాద్రి పునర్నిర్మాణ పనుల వల్ల ఇబ్బంది పడుతున్న భక్తులు

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వారంతంలో పెరిగే రద్దీకి తగ్గట్టుగా కనీస సౌకర్యాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

పాతవి తొలగించారు.. ప్రత్యామ్నాయం మరిచారు..

ఆలయ పునర్ నిర్మాణం పనుల్లో భాగంగా.. కొండపైన ఉన్న వసతి గృహం, ప్రసాద తయారీ కేంద్రం, భక్తులకు అందించే అన్న ప్రసాద వితరణ కేంద్రం, ఇతర కార్యాలయాల పాత భవనాలను తొలగించారు. వాటికి ప్రత్యామ్నాయం చూపలేదు.

పుణ్యస్నానం చేసేందుకు సరైన దారులే లేవు..

పుష్కరిణి వద్ద పనులు జరుగుతున్నందున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి తాత్కాలికంగా నల్లాలు ఏర్పాటు చేశారు. వాటిని చేరుకునేందుకు సరైన దారిలేక భక్తులు అవస్థలు పడుతున్నారు.

'దారికి అడ్డంగా ఉంటే కళ్యాణకట్టకు ఎలా వెళ్తాం..?'

స్నానపు గదులు, బట్టలు మార్చుకునే గదులు తక్కువ ఉన్నందున చాలా ఇబ్బందిపడుతున్నామని భక్తులు వాపోతున్నారు. కల్యాణకట్టకు వెళ్లే మార్గంలో సరైన సూచిక బోర్డులు లేవని.. పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తొలగించిన రాళ్లు, ఇనుప కడ్డీలు దారికి అడ్డంగా ఉన్నందున నడిచేందుకు ఇబ్బందిపడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు వెంటనే స్పందించి తగిన సౌకర్యాలు చేపట్టి భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండిః ప్లాస్టిక్​ను పారదోలకుంటే... భవిష్యత్తు అంధకారమే!

Intro:Tg_nlg_185_15_bakthula_ibbandhulu_pkg_TS10134

యాదాద్రి భువనగిరి..

సెంటర్.యాదగిరిగుట్ట..

రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్.9177863630

యాంకర్...యాదాద్రి స్వామి వారి దర్శనము వచ్చే భక్తులకు తప్పని,ఇబ్బందులు...

వాయిస్... తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు ఒకవైపు జరుగుతున్నప్పటికీ సామాన్య భక్తులకి తప్పని ఇబ్బందులు గత కొద్ది రోజుల క్రితం వచ్చిన యాదాద్రి వచ్చిన కెసీఆర్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఆలయ పనుల్లో లో వేగం పుంజుకున్న ప్పటికీ కొండపైన వసతి గృహం శ్రీచక్ర వసతి గృహ సముదాయం ,ప్రసాద తయారీ కేంద్రం,భక్తులకు అందించే అన్న ప్రసాద వితరణ కేంద్రం,మరియు ఇతర కార్యాలయాలు పాత భవనాలను తొలగించినప్పటికీ యాదాద్రికి శని, ఆదివారాల్లో, వచ్చే భక్తులకు కనీస సౌకర్యాల విషయాల్లో లోటు కనిపిస్తుంది , సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని కి వీలు లేక పుష్కరిని పనులు, జరుగుతున్నప్పటికీ దేవస్థానం వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నల్లాల వద్ద సాగిస్తున్నారు, భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన కళ్యాణ కట్ట తలనీలాలు సమర్పించే చోటు , స్థానపు గదులు, సరిపడా బాత్రూంలు,లేక బట్టలు మార్చుకునే గదులు,లేక అవస్థలు పడుతున్నారు ఒక వైపు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో తొలగించిన భవనాల రాళ్లు ,సిమెంట్ ,రాళ్ళు ఇనుప కడ్డీలు , తొలగించిన చోట ఉండడంతో భక్తులకు అటువైపుగా పుష్కరిణి వద్ద గల హనుమాన్ ఆలయం దర్శనాలు, స్థానాలు ఆచరించు నల్లాల వద్దకు మరియు కళ్యాణ కట్ట కు వెళ్లే చోటు కాలి బాట సరిగా లేకపోవడంతో భక్తులు చిన్నపిల్లలు వృద్ధులు చంటి పిల్లల తల్లులు ఇబ్బందులు పడుతున్నారు,తాత్కాలిక0గా తలనీలాలు సమర్పించే చోటులో నిన్న మొన్న కురిసిన వర్షాలకు బిల్లింగ్ లోకి కొద్దీ కొద్దిగా వర్షపు నీరు కూడావచ్చి చేరింది, మరియు కొండపైన భక్తులకు సదుపాయాల విషయంలో సరైన సూచిక బోర్డు లు,లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని భక్తులు వాపోతున్నారు
వెంటనే తగిన సౌకర్యాలు చేపట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందని భక్తులు తెలుపుతున్నారు....
వెంటనే అధికారులు కళ్యాణ కట్ట వద్ద మెట్ల నిర్మాణం చేపట్టాలని హనుమాన్ ఆలయం కి వెళ్లు దారి పునరుద్ధరణ పనులు చేపట్టాలని భక్తులకు తాత్కాలికంగా వసతి కిషెడ్లు ఏర్పాటు చేయాలని మరియు స్థానపు గదులు , నల్లాల వద్ద గల పాకురు ను తొలగించాలని పుష్కరిని మరమ్మతులు వెంటనే చేపట్టి భక్తులకు అందించాలని భక్తులు కోరుతున్నారు.
భక్తులు కూడా యాదాద్రి అభివృద్ధికి సహకరిస్తామని కానీ కనీస సౌకర్యాల విషయంలో లో దేవస్థానం విఫలం కాకూడదని కోరుచున్నారు.....

బైట్..1...భక్తుడు..హైదరాబాద్..

బైట్..2...భక్తుడు..హైదరాబాద్..

బైట్..3...భక్తురాలు..hyd..

బైట్..4....సీపీఐ నాయకులు..బబ్బూరి.శ్రీధర్..

Body:Tg_nlg_185_15_bakthula_ibbandhulu_pkg_TS10134

Conclusion:Tg_nlg_185_15_bakthula_ibbandhulu_pkg_TS10134

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.