కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. భువనగిరిలో సీపీఐ మహా నిర్మాణ సభలో పాల్గాన్న చాడ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, వృత్తులు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం లౌకిక వ్యవస్థకు భిన్నంగా ఉందని.... రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపించారు. పౌరసత్వ బిల్లు ఉపసంహరించుకోవాలని, ఎన్ఆర్సీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాసంగి పూర్తయినా రాష్ట్రంలో రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికీ రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అని చెబుతూ... అప్పుల తెలంగాణగా మార్చారని ప్రభుత్వంపై చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి' - మోదీ ప్రభుత్వంపై చాడ విమర్శలు
భువనగిరిలో సీపీఐ మహా నిర్మాణ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. భువనగిరిలో సీపీఐ మహా నిర్మాణ సభలో పాల్గాన్న చాడ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, వృత్తులు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం లౌకిక వ్యవస్థకు భిన్నంగా ఉందని.... రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపించారు. పౌరసత్వ బిల్లు ఉపసంహరించుకోవాలని, ఎన్ఆర్సీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాసంగి పూర్తయినా రాష్ట్రంలో రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికీ రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అని చెబుతూ... అప్పుల తెలంగాణగా మార్చారని ప్రభుత్వంపై చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: వేడుకలో పరిచయం.. వంచించి సామూహిక అత్యాచారం