తొలినాళ్లలో జిల్లాను కట్టుదిట్టం చేసి గ్రీన్ జోన్‌గా మారేందుకు దోహదపడిన ఉన్నతాధికారులే చివరకు... కరోనాతో బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారికి పాజిటివ్ అని తేలడం వల్ల మిగతా ఉన్నతాధికారులంతా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. జనతా కర్ఫ్యూ తర్వాత ఇంచుమించు రెండు నెలల వరకు ఒక్క కేసూ నమోదు కాని యాదాద్రి భువనగిరి జిల్లాలో... గత కొద్దికాలంగా వలస కూలీల వల్ల కొవిడ్ కేసులు పెరుగుతూ వచ్చాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణాధికారితోపాటు... ఆయన సతీమణి వ్యాధి బారిన పడ్డారు. శనివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న సీఈవో, అవే లక్షణాలు తన సతీమణిలోనూ కనిపించడంతో కొవిడ్ పరీక్షల కోసం వైద్యాధికారులను సంప్రదించారు. బుధవారం రక్త నమూనాల్ని పంపగా... ఇవాళ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు జిల్లా యంత్రాంగం ధ్రువీకరించింది. కలెక్టరేట్ సహా జడ్పీ కార్యాలయాన్ని పారిశుద్ధ్య సిబ్బంది శుద్ధి చేశారు.
ఇవీ చూడండి: గాంధీలో కొవిడ్-19 బాధితుని మృతదేహం అదృశ్యం