యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో ఇద్దరికి, పోచంపల్లి మండలంలో ఒకరికి వ్యాధి సోకింది. భువనగిరిలోని సూపర్‌మార్కెట్ నిర్వాహకులైన దంపతులు శుభకార్యం కోసం ఇటీవలే హైదరాబాద్ వెళ్లి రాగా... అనుమానం వచ్చి పరీక్షలు చేయిస్తే పాజిటివ్ నిర్ధరణ అయింది. వారి కుటుంబ సభ్యులు 11 మంది, సూపర్ మార్కెట్లో పనిచేసే ఏడుగురు, మొత్తం 18 మందిని క్వారంటైన్ చేశారు.
అటు భూదాన్ పోచంపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిలో లక్షణాలు బయటపడ్డాయి. ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఆసుపత్రి చికిత్స కోసం వెళ్లి పరీక్షలు చేయించుకోగా.. కరోనా నిర్ధరణ అయింది. దీనితో ఆయన ప్రాథమిక కాంటాక్టులపై అధికారులు దృష్టి సారించారు. వీటితో కలిపి యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు 19 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: రష్యా అధ్యక్షునిగా కొనసాగేందుకు పుతిన్‌కు లైన్ క్లియర్!