ETV Bharat / state

రసాభాసగా మారిన జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం - yadadri bhuvanagiri district news

యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్​ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నిధులు లేకపోవడం వల్ల ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నామని జడ్పీటీసీలు వాపోయారు. రాష్ట్రంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆరోపించారు.

రసాభాసగా మారిన జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం

author img

By

Published : Feb 27, 2021, 4:53 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మండలాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేవని జడ్పీ ఛైర్మన్​తో కాంగ్రెస్ జడ్పీటీసీలు వాదనకు దిగారు. నిధులు లేకపోవడం వల్ల ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు. కనీసం వర్షాకాలంలో రోడ్లపై గుంతల్లో మట్టి పోయించుకోవడానికి కూడా నిధులు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల మంజూరుపై సమావేశంలో మాట్లాడేందుకు వీలు కల్పించనందుకు నిరసనగా సమావేశాన్ని బహిష్కరించి జడ్పీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు నిరసనకు దిగారు.

తెరాస సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జడ్పీటీసీలను, ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని వారు విమర్శించారు. రైతులకు ఇచ్చిన ట్రాక్టర్లు కొందరు అమ్ముకున్నారని... వారిపై చర్యలు తీసుకోవాలని చౌటుప్పల్ జడ్పీటీసీ కోరారు. పంచాయతీ రాజ్ చట్టం ద్వారా అందాల్సిన నిధులు మంజూరు చేయాలని ఆలేరు జడ్పీటీసీ విజ్ఞప్తి చేశారు. గుండాల మండలంలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్లే రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడని ... వెంటనే అంబులెన్స్​ సౌకర్యం కల్పించాలని గుండాల జడ్పీటీసీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి కృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణా రెడ్డి, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది: సోమేశ్​ కుమార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.