ETV Bharat / state

మెలకువలు నేర్చారు.. పాల ఉత్పత్తిలో అగ్రగాములయ్యారు.! - తెలంగాణ వార్తలు

వ్యవసాయమే కాకుండా ప్రత్యామ్నాయంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలోని రైతులు పాడి సంపదతో లాభాలు గడిస్తున్నారు. గత కొన్నేళ్లగా పశుపోషణలో అనుభవం ఉన్నవారు నిత్యం 20 నుంచి 70లీటర్ల వరకు డైయిరీలకు పాలు పోస్తున్నారంటే ఇక్కడి ప్రజలు పాడిపై ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో తెలుస్తోంది. దాదాపు గ్రామస్థులందరూ పాడి పోషణతోనే లాభాలు గడిస్తూ జిల్లాలోనే గుర్తింపు పొందారు.

మెలకువలు నేర్చారు.. పాల ఉత్పత్తిలో అగ్రగాములయ్యారు.!

author img

By

Published : Dec 13, 2020, 4:38 PM IST

Updated : Dec 13, 2020, 5:39 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండల పరిధిలోని చొల్లేరులో 550 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో సుమారు 350 కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. వారంతా సాగుతో పాటు ప్రత్యామ్నాయంగా ప్రారంభించిన పాడి పరిశ్రమ మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ప్రతి ఇంటికి కనీసం రెండు నుంచి ఆరు పాడి ఆవులు ఉండని కుటుంబమే లేదంటే పాడిపై వారు కనబరుస్తున్న ఆసక్తి తెలుస్తుంది. రైతులతో పాటు కుల వృత్తుల వారు పశువులను పెంచుకుంటున్నారు. ప్రతి కుటుంబం నిత్యం పది నుంచి 70 లీటర్ల వరకు పాలు విక్రయిస్తున్నారు.

రోజుకు 2500 లీటర్లు

చొల్లేరులో నెలకొల్పిన మదర్ డైరీ సెంటర్​కు రోజు సుమారు 1600 లీటర్ల పాలు వస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర ప్రైవేట్ సెంటర్​లు, సొంతంగా ఇతర ప్రాంతాలకు తరలించే వారు ఇలా మొత్తంగా సుమారు 2,500 లీటర్ల వరకు పాలు విక్రయిస్తున్నారు. పాడి పరిశ్రమ లాభాదాయకంగా ఉండడం వల్ల వ్యవసాయం వదిలేసి చాలామంది పాడివైపే మొగ్గుచూపుతున్నారు.

సబ్సిడీపై పశువుల పంపిణీ

రాష్ట్రంలో పాడి సంపదను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. పశుసంవర్ధక శాఖ నుంచి రైతులకు సబ్సిడీపై గేదెలు మంజూరు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా చొల్లేరులోనే 120 పాడిగేదెలను కొనుగోలు చేశారు.

మరింత ఉత్పత్తి పెంచాలి

గ్రామంలోనే డైరీలు అందుబాటులో ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. నాణ్యమైన పాలకు గరిష్టంగా 29.50, బర్రె పాలకు రూ.30నుంచి 40 చెల్లిస్తున్నాం. పాల ఉత్పత్తిని పెంచేందుకు మరింత ఆసక్తి చూపాలని పాడి రైతులకు కోరుతున్నాం.

-కౌకుంట్ల రామచంద్రారెడ్డి, పాల సంఘం ఛైర్మన్ చొల్లేరు.

ఇంటి ఖర్చులకు ఇబ్బంది లేదు

ఓవైపు వ్యవసాయం చేసుకుంటూ పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాము. పాల విక్రయం ద్వారా నెలకు ఎనిమిది నుంచి పది వేల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. వ్యవసాయంలో నష్టం వస్తే, పాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇంటి ఖర్చులకు ఇబ్బందులు లేకుండా పోతుంది.

-పాడి రైతు

వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పాడి పోషణతో లాభాలు గడిస్తూ.. సొంత గ్రామంలోనే ఉపాధి పొందుతున్నందుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోనే అధిక మొత్తంలో పాల ఉత్పత్తి చేస్తూ చొల్లేరు రైతులు ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి: వాడిన పూలు వికసించెనే.. పడతి ప్రగతికి సహకరించెనే...

Last Updated : Dec 13, 2020, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.