ETV Bharat / state

తెరాస ప్రభుత్వ ధోరణికి నిరసనగా తహసీల్దార్​కు వినతిపత్రం - raithu runamafi

తెరాస ప్రభుత్వ ధోరణికి నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో భాజపా నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీలో భాగంగా వెంటనే లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

bjp leaders issued petition to mro
bjp leaders issued petition to mro
author img

By

Published : May 21, 2020, 11:22 PM IST

తెరాస ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీ, రైతుబంధు విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని యాదగరిగుట్టలో భాజపా నాయకులు ఆరోపించారు. రాష్ట్ర సర్కారు ధోరణికి నిరసనగా భాజపా నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుబంధు పథకం కింద డబ్బులు ఏ ప్రాతిపదికన రైతుల ఖాతాల్లో జమ చేశారో అదే ప్రాతిపదికన ప్రస్తుతం కొత్తగా అర్హులైన వారితో పాటుగా రైతులందరి ఖాతాల్లో జమచేయాలని డిమాండ్​ చేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల హామీగా ముఖ్యమంత్రి రైతులందరికీ లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తామని వాగ్దానం చేశారని, ఈ ప్రభుత్వం రెండో విడత అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా నేటికీ రైతు రుణమాఫీ జరగలేదని విమర్శించారు. రైతు రుణాలను మాఫీ చేసి మళ్లీ కొత్త రుణాలు ఇచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని భాజపా మండల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు తొడిమె రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రైతుబంధును తొలగించేందుకు ప్రభుత్వం కొత్త మెలికలు: రేవంత్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.