యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 22వ వార్డు అభ్యర్థిగా భాజపా నుంచి పోటీ చేసి బొర్రా రాకేశ్ గెలుపొందారు. పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఛైర్మన్ ఎన్నిక రోజు సమావేశానికి గైర్హాజరయ్యారు. తెరాసకు అనుకూలంగా వ్యవహరించినందుకు వెంటనే బొర్రా రాకేశ్ రాజీనామా చేయాలంటూ నల్గొండ చౌరస్తాలో భాజపా, ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. కార్యకర్తల విశ్వాసాలు, నమ్మకాలను, శ్రమను పునాదిగా చేసుకుని గెలిచిన రాకేశ్ అధికార పార్టీ ప్రలోభాలకు లొంగిపోయారని ఆరోపించారు.
ఇవీ చూడండి: మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు కావాలి : హరీశ్‌రావు