ETV Bharat / city

మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు కావాలి : హరీశ్​రావు - finance commission in delhi

కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా మిషన్ భగీరథ కోసం నిధులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘాన్ని మంత్రి హరీశ్​ రావు కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీలో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్​ ఎన్​.కె.సింగ్​తో మంత్రి హరీశ్​రావు భేటీ అయ్యారు.

minister harish rao meet finance commission in delhi
ఆర్థిక సంఘం సానుకూలంగా స్పందించింది: హరీశ్​రావు
author img

By

Published : Jan 28, 2020, 1:31 PM IST

దిల్లీలో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్‌తో మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల శాతం పెంపు, రుణపరిమితి పెంపునకు మంత్రి విజ్ఞప్తి చేశారు. మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని కోరారు.

కాళేశ్వరం, మిషన్ భగీరథకు నిర్వహణ నిధులు ఇచ్చేలా చూడాలని... ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను ఎన్.కె.సింగ్‌కు హరీశ్​ రావు అందజేశారు. మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు కేంద్రం ఇచ్చేలా చూడాలని మంత్రి చేశారు. గతంలో మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసినట్లు ఎన్​.కె.సింగ్​ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంఘం ఈ విషయాలపై సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వెల్లడించారు.

ఆర్థిక సంఘం సానుకూలంగా స్పందించింది: హరీశ్​రావు

ఇవీ చూడండి: రుణాలు సేకరించి ప్రాజెక్టులు కట్టాం.. నిధులివ్వండి: హరీశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.