యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 225 మంది ఉన్న పాఠశాలలో.. నిన్న రాత్రి నుంచి సుమారు 45 మంది అస్వస్థతకు గురయినట్లు సమాచారం. అధికారులు మాత్రం సుమారు 20 మంది అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో చేర్చకుండా వసతిగృహంలోనే ఉంచి వైద్యం అందిస్తున్నారు.
నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తయారుచేసిన ఆహార పదార్థాలను విద్యార్థులు తినడం వల్లనే అస్వస్థతకు గురయినట్లు సమాచారం.
అధికారులేమన్నారంటే..
15 నుంచి 20 మంది అస్వస్థతకు గురైనట్లు డీఈవో తెలిపారు. అందులో నలుగురి పరిస్థితి కాస్త విషమంగా ఉందన్నారు. ఇంటి నుంచి తీసుకొచ్చిన తినుబండారాలను తినడం వల్లనే వాంతులు అయినట్లు వైద్యురాలు శోభ తెలిపారు.
ఇవీచూడండి: పాఠశాల భవనం పైనుంచి దూకిన విద్యార్థి... మృతి