పరమ పవిత్ర కార్తీక మాసం సోమవారం నుంచి ఆరంభమవుతుంది. ఆధ్యాత్మిక భక్తి మార్గాల్లో సమాజాన్ని పయనింపచేసే మాసం అని ప్రతీతి. సాంప్రదాయం, నియమ నిష్ఠతలతో కూడిన ఈ కార్తీకంలో శివ కేశవులను ఆరాధిస్తారు. వైకుంటం, కైలాసాన్ని నిలయాలను దీపారాధనతో కొలిచి భక్తుల ఆధ్యాత్మికతను చాటుకుంటారు. అఖండ దీపారాధనతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలతో కార్తీకమాసం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తారు. నరసింహుడి చెంత భక్తులు వ్రతాలతో పాటు దీపారాధన నిర్వహిస్తారు. ఈ మేరకు యాదాద్రిలో ఏర్పాట్లను చేపట్టింది ఆలయ బోర్డు.
ఇవీచూడండి: రాజ్‌భవన్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం