యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఊంజల్ సేవా మహోత్సవంలో భాగంగా అమ్మవారిని తులసీదళాలు, వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉయ్యాలలో వేంచేపింపజేశారు.
వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాద్యాలు, సన్నాయి మేళాల మధ్య అమ్మవారికి ప్రత్యేక సేవలు చేశారు. ప్రత్యేక అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం విచారం