ETV Bharat / state

యాదగిరిగుట్ట అభివృద్ధికి సహకారం అందిస్తా: ప్రభుత్వ విప్​

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధికి తన సహకారం అందిస్తానని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

aleru mla sunitha toured in yadagirigutta
యాదగిరిగుట్ట అభివృద్ధికి సహకారం అందిస్తా: ప్రభుత్వ విప్​
author img

By

Published : Dec 13, 2020, 3:07 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో రూ.80 లక్షల మున్సిపల్ నిధులతో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​రెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఓపెన్ జిమ్​ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.

యాదగిరిగుట్ట అభివృద్ధికి మున్సిపల్ పాలక వర్గం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శంకుస్థాపన చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: ఎర్రబెల్లి సవాల్​: వరంగల్​ నగరానికి ఎవరేం చేశారో తేల్చుకుందాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.