ETV Bharat / state

బస్టాండ్​లో​ మదర్​ ఫీడింగ్​ సెంటర్​ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ - yadadri bhuvanagiri district news

రోటరీ క్లబ్​ ఆధ్వర్యంలో డాక్టర్ పద్మజా సంతాన సాఫల్య కేంద్రం సహకారంతో యాదగిరిగుట్ట బస్టాండ్​లో మదర్​ ఫీడింగ్​ సెంటర్​ను ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత మహేందర్​రెడ్డి ప్రారంభించారు.

aleru mla gongidi sunitha inaugurated mother feeding centre at yadagirigutta busstand
యాదగిరిగుట్ట బస్టాండ్​లో​ మదర్​ ఫీడింగ్​ సెంటర్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Nov 10, 2020, 8:50 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్టాండ్ నందు మదర్ ఫీడింగ్ సెంటర్(పిల్లలకు తల్లి పాలు ఇచ్చు గది)​ను ప్రభుత్వ విప్​, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్​రెడ్డి ప్రారంభించారు. రోటరీ క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో డాక్టర్ పద్మజా సంతాన సాఫల్య కేంద్రం సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు.

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని బస్టాండ్లలో మదర్ ఫీడింగ్ సెంటర్లను ప్రారంభించడం అభినందనీయమన్నారు. సేవలు ఇంకా విస్తృత పరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు ఎంపల్లి వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణ, కోశాధికారి బండారు బాలరాజు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న, డిపో మేనేజర్ రఘు, పద్మజ సంతాన సాఫల్య కేంద్రం ప్రతినిధి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా డా. రఘురాం రావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.