యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన 10 మంది దివ్యాంగులకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి సాయం చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ద్వారా ఆర్థిక పునరావాసం కింద దివ్యాంగులకు 50 వేల రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు.
దివ్యాంగులను వివాహం చేసుకున్న మరో నాలుగు జంటలకు ప్రోత్సాహం కింది ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ప్రతిభకు లోపం అడ్డు కాదని ప్రభుత్వ విప్ తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో గల బీసీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు