ETV Bharat / state

అమ్మ రా'లేద'ని తెలియక చిన్నారి దీనచూపులు - యాదగిరి గుట్ట పోలీస్​ స్టేషన్​ వార్తలు

పాపం ఆ చంటి బిడ్డకేం తెలుసు.. తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిందని.. ఆ తల్లికేం తెలుసు.. బిడ్డను వదిలి తన కూతురు అర్ధాంతరంగా తనువు చాలిస్తుందని.! అమ్మ ఒడిలో సేద తీరాల్సిన పసికందు అమ్మమ్మ ఒడిలో వాలిపోయాడు. అమ్మ వస్తుందేమో ఆకలి తీరుస్తుందేమో అని ఆశతో దిక్కులు చూస్తున్నాడు. ఈ హృదయ విదారక ఘటన యాదగిరిగుట్ట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

yadagiri gutta, cholleru village
చొల్లేరు గ్రామం, వివాహిత మృతి
author img

By

Published : Dec 31, 2020, 12:47 PM IST

కన్నతల్లి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. 2నెలల మగబిడ్డకు అమ్మప్రేమను దూరం చేసింది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఆమె.. కడుపున పుట్టిన బిడ్డ గురించి ఆలోచించకపోవటంతో తల్లి ఆలనాపాలనకు ఆ చిన్నారి దూరమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట చోల్లేరు గ్రామానికి చెందిన పూజశ్రీ(25) ఆత్మహత్యకు యత్నించి మంగళవారం అత్తింటి వద్ద మరణించింది. కాగా ఆమెకు 2 నెలల మగబిడ్డ ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఆ బిడ్డకు న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు యాదగిరిగుట్ట పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించారు. భార్యాభర్తల మధ్య కలహాలతో వారి ఆలనాపాలనకు దూరమైన ఆ పసికందును చూసి అక్కడున్న వారు కంటతడి పెట్టారు. గుక్కపట్టి ఏడుస్తున్న మనవడి ధీనస్థితిని అమ్మమ్మ సునీత చూడలేక, ఏమి చేయాలో తోచక.. పాలపీకా నోట్లో పెట్టి ఆ చిన్నారిని నిద్రపుచ్చడానికి యత్నిస్తోంది. ఈ దృశ్యం స్థానికులను కలచివేసింది.

ఇదీ చదవండి: కుటుంబ కలహాలతో నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.