యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో లాక్డౌన్ నిబంధనలు అధిగమించినందుకు గానూ... ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని చెరువులో చేపలు పడుతూ... గుంపులుగుంపులుగా వుంటున్నారన్న సమాచారంతో ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడ ఉన్నవారిని పంపించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగారు. దురుసుగా ప్రవర్తించి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఎస్సై రాజు కాలుకు గాయమైంది. ఇక చేసేదేమీ లేకు పోలీసులు... ఆ ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండొద్దని సీఐ సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:'మరణాలు పెరిగినా.. నేనేమీ అద్భుతాలు చేయలేను'